లాల్‌గడి మలక్‌పేట్‌లో రూ.8 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
ఆర్. జె. న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్ 15వ వార్డులో రూ.8 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పురపాలక సంఘం చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ జనరల్ నిధులతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పురపాలక సంఘం పరిధిలో ప్రజలకు మెరుగైన రహదారులు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి...