లిఫ్ట్ పేరుతో ట్రాప్.. కత్తితో బెదిరించి దోపిడీ చేసిన ఆరుగురు అరెస్ట్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా: లిఫ్ట్ పేరుతో ద్విచక్ర వాహనదారుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగదు, ఆన్‌లైన్ ద్వారా డబ్బులు దోచుకున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 31 రాత్రి అంబేద్కర్ నగర్‌లో పద్మారావు అనే వ్యక్తి నుంచి లిఫ్ట్ తీసుకున్న నిందితులు కొద్దిదూరం వెళ్లిన తర్వాత అతడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం మరో ఐదుగురు కలిసి కత్తితో బెదిరించి బాధితుడి వద్ద ఉన్న రూ.5,000 నగదుతో పాటు గూగుల్ పే...