శామీర్ పెట్ ( ఆర్ జె న్యూస్ ): వర్షాకాలంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మజీద్‌పూర్ వార్డులో చేపడుతున్న నాలాల శుభ్రపరిచే, వరద కాలువల అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పరిశీలించారు.నాలాల్లో పేరుకుపోయిన పూడిక, చెత్త, మురుగును జేసీబీ యంత్రాలతో తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేపడుతున్న పనులను ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నాలాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.వర్షాకాలానికి ముందే అన్ని వార్డుల్లో నాలాల శుభ్రపరిచే పనులు, వరద కాలువల నిర్వహణ, నీటి పారుదల వ్యవస్థ బలోపేతానికి పురపాలక సంఘం చర్యలు చేపడుతోందని చైర్‌పర్సన్ తెలిపారు. డ్రైనేజీ సమస్యలు లేదా నీరు నిలిచే ప్రాంతాలపై ప్రజలు వెంటనే పురపాలక సంఘానికి సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వనజ అశోక్‌రెడ్డి, జస్వంత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు