వర్షాకాల సన్నద్ధతపై చైర్‌పర్సన్ తనిఖీ..! మజీద్‌పూర్‌లో నాలాల అభివృద్ధి పనుల పరిశీలన
శామీర్ పెట్ ( ఆర్ జె న్యూస్ ): వర్షాకాలంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మజీద్‌పూర్ వార్డులో చేపడుతున్న నాలాల శుభ్రపరిచే, వరద కాలువల అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పరిశీలించారు.నాలాల్లో పేరుకుపోయిన పూడిక, చెత్త, మురుగును జేసీబీ యంత్రాలతో తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేపడుతున్న పనులను ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నాలాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా నాణ్యతతో, వేగంగా...