వికసిత్ భారత్‌కు మాదకద్రవ్యాల రహిత యువతే బలం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా "వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ" జిల్లా స్థాయి పోటీలు శుక్రవారం కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని MY Bharat సంస్థ నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.జానపద నృత్యం, జానపద సంగీతం, నుక్కడ్ నాటక్, చిత్రలేఖనం, వాదోపవాదం, నినాద రచన తదితర విభాగాల్లో పాల్గొన్న యువత...