విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలే లక్ష్యం సెయింట్ అన్నా హైస్కూల్‌లో స్కూల్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ సెయింట్ అన్నా హైస్కూల్లో కొత్తగా ఎన్నికైన స్కూల్ క్యాబినెట్ లీడర్ల ప్రమాణ స్వీకార (అపాయింట్‌మెంట్ డే) వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాఘవేంద్ర గౌడ్, హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కెప్టెన్‌తో పాటు వివిధ హౌస్ లీడర్లకు బ్యాడ్జీలు ధరింపజేసి ప్రమాణ...