వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
🔸గణేష్ మండపాల నిర్వాహకులకు జీనోమ్ వ్యాలీ సీఐ గురువయ్య గౌడ్ సూచనలు ఆర్.జె.న్యూస్, మూడుచింతలపల్లి :విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ సూచించారు. రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు, అవసరమైన...