విభా స్కూల్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం విజయవంతం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : విద్యార్థుల ఆరోగ్యమే వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది అనే లక్ష్యంతో విభా స్కూల్, మెడికవర్ హాస్పిటల్స్, క్లోవ్ డెంటల్ మరియు మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 1, 2026 (శనివారం) న పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక హెల్త్ చెక్-అప్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ శిబిరంలో విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, క్లోవ్ డెంటల్ వైద్యులచే దంత పరీక్షలు, మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ నిపుణులచే కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు...