వీధిదీపం వెలగదు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు!

🔸 వైస్‌చైర్మన్‌ రజిత దేవేందర్ తీరుపై స్థానికుల ఆగ్రహం ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపల్‌ పరిధిలోని బండ మాదారం 19వ వార్డులో వీధిదీపం పనిచేయక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వీధిదీపం వెలగడం లేదని సంబంధిత వార్డు ప్రజాప్రతినిధికి సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించడం మినహా సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదని వాపోతున్నారు.వీధిదీపం వెలగకపోవడంతో రాత్రివేళల్లో చీకటి నెలకొంటోందని, దోమల బెడద కూడా అధికంగా ఉందని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు...