వృద్ధురాలి పుస్తెలతాడు చోరీ కేసు: నిందితుడు అరెస్ట్. 4 తులాల బంగారం, యాక్టివా స్వాధీనం.

కీసర, జూన్ 30: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4 తులాల బంగారం, నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.జూన్ 26న చిర్యాల గ్రామానికి చెందిన వృద్ధురాలు సింగిరెడ్డి మల్లమ్మ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన దుండగుడు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కీసర పోలీసులు సీసీటీవీ...