వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!
🔸ఆరోగ్య సిబ్బందికి డీఎంహెచ్వో డాక్టర్ కె. ఆనంద్ హెచ్చరిక ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ హెచ్చరించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ఆయన అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్యం, గర్భిణుల సంరక్షణ, ప్రసవ సేవలు, చిన్నారుల...