RJNEWS TELUGU
Date of Publish : 17 July 2026, 8:16 pm Posted by : RJ NEWS TELUGU

“శామీర్‌పేట యువత రూపొందించిన ‘కథ’ షార్ట్ ఫిలిం ఆవిష్కరణ… ప్రతి ఒక్కరూ ఆదరించాలని భూమిరెడ్డి పిలుపు”

ఆర్ జె న్యూస్,శామీర్‌పేట :

శామీర్‌పేట యువత రూపొందించిన ‘కథ’ యూట్యూబ్ షార్ట్ ఫిలిం శుక్రవారం శామీర్‌పేట కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఘనంగా ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భూమిరెడ్డి మాట్లాడుతూ, స్థానిక యువత ప్రతిభకు నిదర్శనమైన ఈ షార్ట్ ఫిలింను ప్రతి ఒక్కరూ వీక్షించి ప్రోత్సహించాలని కోరారు. తాము పుట్టిన ఊరికే చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నించే వారికి అమ్మవారి శిక్ష ఎలా ఉంటుందనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు శివ బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో షార్ట్ ఫిలిం నటీనటులు, ఆలయ కమిటీ సభ్యులు బాలరాజు గౌడ్, రమేష్, అనిల్, నాగరాజు, రాకేష్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.