‘సర్’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి : మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి
గుండ్లపోచంపల్లి, జూన్ 30: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి సూచించారు. గుండ్లపోచంపల్లి డివిజన్ గౌడవెల్లిలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బీఎల్వోలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను నింపి తప్పనిసరిగా అందజేయాలన్నారు. "సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఓటు హక్కును కోల్పోతే భవిష్యత్‌లో జరిగే...