సీఎంఆర్‌ఐటీలో ఘనంగా ఓరియంటేషన్ డే
ఆర్జె.న్యూస్,మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో కండ్లకోయ సీఎంఆర్‌ఐటీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల కోసం 22వ ఓరియంటేషన్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్‌ఐటీలో చదివిన పలువురు విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం మంచి ప్లేస్‌మెంట్లు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకపాత్ర పోషించనుందని,...