సీఎంఆర్‌ఐటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు – విద్యార్థులకు డిగ్రీలు అందజేత

గుండ్లపోచంపల్లి (ఆర్ జె న్యూస్) జూలై 12 : గుండ్లపోచంపల్లి మండలం కండ్లకోయలో గల సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీఎంఆర్‌ఐటీ)లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మరియు సీఎంఆర్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ చామకూర మల్లారెడ్డి హాజరై ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఇంజనీరింగ్ తర్వాత ప్రతి విద్యార్థి భవిష్యత్తును ప్రణాళిక బద్ధంగా మలుచుకుంటే మల్లారెడ్డి కన్నా గొప్పవారు అవుతారు. విద్యార్థుల...