RJNEWS TELUGU
Date of Publish : 31 July 2026, 5:26 pm Posted by : RJ NEWS TELUGU

సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి మండలి బాధ్యతల స్వీకరణ

ఆర్ జె న్యూస్,మేడ్చల్ : సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 2026–27 విద్యా సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి (స్టూడెంట్ కౌన్సిల్) సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు అధికారికంగా బాధ్యతలు చేపట్టగా, వారికి గుర్తింపు కార్డులు, అధికార చిహ్నాలను అందజేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ సీఈఓ అభినవ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి నాయకత్వం సేవాభావంతో పాటు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని నూతన విద్యార్థి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, కళాశాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తామని నూతన విద్యార్థి మండలి సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.