సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

మేడ్చల్ ఆర్ జె న్యూస్ జూలై 11 : కాండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో (సీఎంఆర్‌టీసీ) 2026 విద్యా సంవత్సరానికి చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులకు డిగ్రీ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలు, ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ –...