సీసీటీవీ ఆధారాలతో చాకచక్యంగా ఛేదించిన సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసు..! దర్యాప్తు అధికారి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కు ప్రశంసలు..!

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 11 : జూన్ 19న మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అధికారి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విచారణ చేపట్టిన బృందం ఘటనాస్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని సమన్వయం చేస్తూ నిందితుడి కదలికలను గుర్తించి, అతడిని మేడ్చల్‌లో...