సుఖవ్యాధులపై అవగాహన పెంచాలి

ఆర్.జె.న్యూస్,అలియాబాద్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుఖవ్యాధులు (STIs), వాటి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు CRG Care ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుఖవ్యాధులపై ప్రజలు అపోహలకు లోనుకావద్దని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని తెలిపారు. CRG Care ప్రతినిధులు సుఖవ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలు,...