సెప్టెంబర్‌లోగా అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం..! 85% పనులు పూర్తి.. పేదలకు ఉచిత వైద్య సేవలకు సిద్ధం: ఎమ్మెల్యే శ్రీ గణేష్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ నెలలోగా పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు ఆస్పత్రి సిద్ధమవుతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెల్లడించారు. మంగళవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ అల్వాల్ టిమ్స్ ఆస్పత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. 🔸 "కొబ్బరికాయ కొట్టింది BRS.. గుమ్మడికాయ కొట్టేది కాంగ్రెస్" ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "BRS...