స్వాతంత్ర్య వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : ఈ నెల 15న మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.వేడుకలకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ముఖ్య అతిథికి పోలీసుల గౌరవ వందనం, బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని పోలీస్‌ శాఖ అధికారులను ఆదేశించారు. వేదిక, కుర్చీలు,...