హెచ్‌ఐవీ నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : హెచ్‌ఐవీ నియంత్రణలో నిర్దేశించిన 95-95-99 లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎయిడ్స్ సురక్ష (MAS) కార్యక్రమంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మంది తమ ఆరోగ్య స్థితిని తెలుసుకునేలా చేయడం, నిర్ధారణ పొందిన వారిలో 95 శాతం మందిని ఏఆర్‌టీ చికిత్సలో చేర్చడం, చికిత్స పొందుతున్న వారిలో వైరల్ సప్రెషన్ సాధించేలా చర్యలు...