హెచ్ పి వి వ్యాక్సిన్ తో సర్వైకల్ క్యాన్సర్ దూరం

ఆర్ జె న్యూస్ మేడ్చల్ : 13 ఏళ్లు నిండిన, 15 ఏళ్లలోపు బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ విధిగా తీసుకోవాలని మేడ్చల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నీరజ్ సూచించారు. శనివారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 200 మందికి హెచ్పీవీ వ్యాక్సిన్ ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... హెచ్ పి వి వ్యాక్సిన్ తో బాలికలకు భవిష్యత్తులో సోకే సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టవచ్చు అన్నారు. బాలికల తల్లిదండ్రులు అవగాహన...