హోటల్ గ్రాండ్ లాడ్జ్‌లో యువతి అనుమానాస్పద మృతి : హత్యా ? ఆత్మహత్యా…?

హైదరాబాద్ (ఆర్ జె న్యూస్) జూలై 3 : లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ వద్ద ఉన్న ‘హోటల్ గ్రాండ్ లాడ్జ్’లో రేణుక (26) అనే యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అల్వాల్‌కు చెందిన రేణుక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే..? పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతురాలైన రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారుక్ (34) అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ నిన్న రాత్రి హోటల్‌లో...