అల్వాల్ రైతుబజార్‌ను తొలగిస్తే 1,500 రైతు కుటుంబాలకు నష్టం!

🔸ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం నేపథ్యంలో రైతుల ఆందోళన 🔸ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి రైతుల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అల్వాల్ రైతుబజార్‌ను తొలగించనున్న నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుబజార్‌ను తొలగిస్తే దానిపై ఆధారపడిన సుమారు 1,500 రైతు కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొంటూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్‌, సిద్దిపేట, మెదక్‌, నల్గొండ జిల్లాల్లోని వివిధ గ్రామాల నుంచి రైతులు ప్రతిరోజూ కూరగాయలను తీసుకొచ్చి...