RJNEWS TELUGU
Date of Publish : 07 September 2026, 11:10 pm Posted by : RJ NEWS TELUGU

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ జైలర్

ఆర్.జె.న్యూస్, డెస్క్ : కరీంనగర్ హుజురాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ.10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అధికార ప్రకటన ప్రకారం.. నిందితులుగా శ్రీ నంపల్లి దేవేందర్ (46), హుజురాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ (A-1), రావుల హరీష్ (30), ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ (A-2) గా గుర్తించారు. సెప్టెంబర్ 7, 2026 సాయంత్రం 5:45 గంటలకు హుజురాబాద్ లోని పెట్రోల్ బంక్ వద్ద ఏసీబీ అధికారులు ఇద్దరినీ పట్టుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ములాఖత్ లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ చేయకుండా ఉండేందుకు రూ.10 వేలు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు A-2 వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ టెస్టులో అతని చేతి వేళ్లు పాజిటివ్ గా తేలాయి. ఇద్దరినీ కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు లేదా వాట్సాప్ 9440446106 లో సంప్రదించాలని ఏసీబీ కోరింది.