RJNEWS TELUGU
Date of Publish : 16 September 2026, 7:12 pm Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్ ట్రాఫిక్ పరిధిలో 10 కేసుల పరిష్కారం – డ్రంకన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుల్లో ఇద్దరికి జైలు.. రూ.15,700 జరిమానా

అర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన 10 కేసులను బుధవారం కోర్టులో పరిష్కరించినట్లు మేడ్చల్‌ ట్రాఫిక్‌ సీఐ కె. క్రాంతి కుమార్‌ తెలిపారు. మేడ్చల్‌ ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి, VII అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో కేసుల విచారణ జరిగింది.డ్రంకన్‌ డ్రైవ్‌కు సంబంధించిన ఎనిమిది కేసుల్లో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. ఒకరికి మూడు రోజులు, మరొకరికి రెండు రోజుల జైలు శిక్ష ఖరారైంది. ఈ కేసుల్లో మొత్తం రూ.13,700 జరిమానా విధించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన రెండు కేసుల్లో రూ.2,000 జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని సీఐ క్రాంతి కుమార్‌ పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.