మేడ్చల్ ట్రాఫిక్ పరిధిలో 10 కేసుల పరిష్కారం – డ్రంకన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఇద్దరికి జైలు.. రూ.15,700 జరిమానా అర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన 10 కేసులను బుధవారం కోర్టులో పరిష్కరించినట్లు మేడ్చల్ ట్రాఫిక్ సీఐ కె. క్రాంతి కుమార్ తెలిపారు. మేడ్చల్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో కేసుల విచారణ జరిగింది.డ్రంకన్ డ్రైవ్‌కు సంబంధించిన ఎనిమిది కేసుల్లో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. ఒకరికి మూడు రోజులు,...