బాల్కొండలో బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది

ఆర్.జె.న్యూస్,బాల్కొండ: నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి మండలం కొనాపూర్, కేఎస్‌ తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు సుమారు 100 మంది బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.