శామీర్‌పేట, జూన్ 30 : తెలంగాణ ఉద్యమ స్పూర్తిని చాటుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో భారీ విజయ సంకల్ప యాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. అంబాజీపేట నుంచి అలంపూర్ వరకు 101 కార్లతో మహా ర్యాలీ నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఫోరం నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యమకారులు శామీర్‌పేటలోని ఉద్యమకారుడు మైసయ్య ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్యక్రమ సన్నాహాలను ప్రారంభించారు.
జూన్ 29, 2026 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ జోగులాంబ అమ్మవారి క్షేత్రం అలంపూర్‌లో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. అంబాజీపేట నుంచి ప్రారంభమయ్యే ఈ 101 కార్ల ర్యాలీ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ వేడుకలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.