ఇంటి వద్దే పురుడు పోసిన 108 సిబ్బంది
🔸పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.. తల్లీబిడ్డ క్షేమం ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేశారు. చింతల్ లో గోపికృష్ణ, ఆయన భార్య అక్షిత నివాసం ఉంటున్నారు. అక్షిత గర్భిణి కాగా, గురువారం తెల్లవారుజామున పురిటినొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.దీంతో అంబులెన్స్ సిబ్బంది నరేందర్‌రెడ్డి, డ్రైవర్ బాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అక్షితకు పురిటినొప్పులు అధికంగా ఉండటంతో పరిస్థితిని గుర్తించి, ఇంటి...