జీడిమెట్లలో 11.365 కిలోల గంజాయి స్వాధీనం..! ఇద్దరు అరెస్ట్.. ప్రధాన నిందితుడు పరార్

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 11.365 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లోని హెచ్‌ఎంటీ జంగిల్ పాత ప్రభుత్వ కళాశాల సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.అరెస్టైన వారిలో మారేడుబుడి రాజు (33), సిరాపు హేమ (41) ఉన్నారు. ఏ1గా ఉన్న రాజు విశాఖపట్నం జిల్లా మాడుగుల ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, సంచులను...