ప్రజావాణికి 111 అర్జీలు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. విజయేందర్‌రెడ్డితో పాటు డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై మొత్తం 111 అర్జీలను అధికారులకు అందజేశారు. అర్జీదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజావాణిలో అందిన ప్రతి...