RJNEWS TELUGU
Date of Publish : 07 October 2026, 10:23 pm Posted by : RJ NEWS TELUGU

అనారోగ్యంతో బాధపడుతున్న నాగ సుందర్ సింగ్‌కు రూ.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ.

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న అల్వాల్ డివిజన్ మాదేవి నగర్ కాలనీకి చెందిన నాగ సుందర్ సింగ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల నేపథ్యంలో నాగ సుందర్ సింగ్ కుటుంబ సభ్యులు సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం రూ.2 లక్షల సహాయాన్ని మంజూరు చేసింది.ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యేక్యాంపుకార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎల్‌ఓసీ పత్రాన్ని నాగ సుందర్ సింగ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖరీదైన వైద్య చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ప్రజలకు అవసరమైన సమయంలో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం అందేలా తన వంతు కృషి కొనసాగిస్తానని పేర్కొన్నారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు జేఏసీ సురేందర్ రెడ్డి, వి. రాజేందర్ సింగ్, లక్ష్మణ్ యాదవ్, కేబుల్ రమేష్, బాలకృష్ణ, ఉమేష్, ప్రభాకర్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.