24వ వార్డులో రూ.10 లక్షలతో డ్రైనేజీ పనులకు శ్రీకారం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపాలిటీ 24వ వార్డు పరిధిలో మున్సిపల్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శుభారంభం పలికారు. స్థానిక వార్డు కౌన్సిలర్ అర్చనా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీదేవి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ, డ్రైనేజీ పనులు పూర్తయితే వార్డులో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మున్సిపల్ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ మౌలిక సదుపాయాల...