298 డివిజన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సమర సన్నాహం
🔸కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మల్లేష్‌గౌడ్ 🔸పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని 298వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రాజకీయ ఉత్సాహంతో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ అధ్యక్షులు మల్లేష్‌గౌడ్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు....