వందేమాతరం పాడకుండా అడ్డుకుంటే 3 ఏళ్ల జైలు..! జాతీయ గౌరవ నిరోధక సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

ఆర్.జె.న్యూస్, న్యూఢిల్లీ : ఇకపై జాతీయ గీతం 'జనగణమన'తో పాటు జాతీయ గేయం 'వందేమాతరం'ను పాడకుండా అడ్డుకున్నా, ఆలాపనకు భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు జాతీయ గౌరవ భంగ నిరోధక (సవరణ) చట్టం, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదముద్ర వేశారు. పార్లమెంటు ఉభయ సభలు ఇటీవల ఈ బిల్లును ఆమోదించగా, రాష్ట్రపతి సంతకంతో ఇది అధికారికంగా చట్టరూపం దాల్చి వెంటనే అమల్లోకి వచ్చింది. 🔸చట్టంలో కీలక మార్పులు 1971 నాటి జాతీయ గౌరవ నిరోధక చట్టం పరిధిని...