RJNEWS TELUGU
Date of Publish : 02 September 2026, 4:24 pm Posted by : RJ NEWS TELUGU

420 హామీలను వెంటనే అమలు చేయాలి. లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ముందు 420గా మిగిలిపోతారు

🔸పూడూరు–కిష్టాపూర్‌లో బీఆర్‌ఎస్ నిరసన
🔸ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ కో-ఆప్షన్ సభ్యుడు నవీన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు పూడూరు–కిష్టాపూర్ పరిధిలోని 298వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి కేఎల్‌ఆర్‌లోని శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. నిరసన సందర్భంగా నవీన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే ఇప్పటివరకు అనేక హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెట్టడం సరికాదన్నారు.“420 హామీలను వెంటనే అమలు చేయాలి. లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ముందు 420గా మిగిలిపోతారు” అని నవీన్‌రెడ్డి విమర్శించారు.ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం 298వ డివిజన్‌లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 298వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని నవీన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.