మేడ్చల్ సీఎస్ఐ వెస్లీ చర్చిలో ఘనంగా 80వ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే వేడుకలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ సిఎస్ఐ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే సర్వీస్ ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల విశ్వాసం, ధైర్యం, కుటుంబం, చర్చి, సమాజంలో వారి పాత్రపై సందేశాలు అందించారు. క్రైస్తవ ఐక్యతకు ప్రతీక చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న నిర్వహిస్తారు. 1947 సెప్టెంబర్ 27న దక్షిణ భారతదేశంలోని ఆంగ్లికన్, మెథడిస్ట్, కాంగ్రిగేషనల్,...