ఆలియాబాద్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆర్.జె.న్యూస్,ఆలియాబాద్ : దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ఆలియాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా జరిగిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కంఠం శిరీష కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి, జాతీయ గీతాన్ని అందరూ కలిసి ఆలపించారు. పోలీసుల గౌరవ వందనంతో ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్...