పిల్లలను స్కూల్‌లో దించి వస్తుండగా వ్యాపారి కిడ్నాప్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో ఓ వ్యాపారి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. గాజులరామారానికి చెందిన బీధల అశోక్‌రెడ్డి (37)ను ఐదుగురు వ్యక్తులు కారులో వచ్చి బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం అశోక్‌రెడ్డి తన పిల్లలను స్కూల్‌లో దించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు అశోక్‌రెడ్డిపై దాడి చేసి బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆకృతి...