RJNEWS TELUGU
Date of Publish : 13 September 2026, 7:31 pm Posted by : RJ NEWS TELUGU

టిప్పర్‌ను ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యాద్గారిపల్లి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టిప్పర్‌ లారీని వెనుక నుంచి XUV 700 కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.