ఎల్లంపేటలో శిథిలావస్థకు చేరిన ఇల్లు..! పెచ్చులూడి తండ్రి, కూతురికి గాయాలు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా: ఎల్లంపేట్ మున్సిపల్‌ పరిధిలోని తలారి బస్తీలో శిథిలావస్థకు చేరిన ఇంటి పైకప్పు పెచ్చు ఒక్కసారిగా ఊడిపడటంతో తండ్రి, కూతురికి గాయాలయ్యాయి. తలారి యాదగిరి (40), ఆయన కుమార్తె వైష్ణవి (13) ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యాదగిరి కుటుంబానికి ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారులు స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని...