దేవరయాంజాల్‌లో లాజిస్టిక్స్‌ గోదాంలో అగ్నిప్రమాదం

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : షామీర్‌పేట్‌ మండలంలోని దేవరయాంజాల్‌ గ్రామ పరిధిలోని కోల్డ్‌రష్‌ లాజిస్టిక్స్‌ గోదాంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గోదాం సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనలో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది