RJNEWS TELUGU
Date of Publish : 23 August 2026, 6:59 pm Posted by : RJ NEWS TELUGU

వేముల మహేష్ గౌడ్ నివాసంలో ఘనంగా బోనాల పండుగ

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ నివాసంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేముల మమత గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నర్సింహా, వేముల శంకర్ గౌడ్, నాయకులు నానావత్ సురేష్ నాయక్, డొంకెన శంకర్ గౌడ్, వేముల గోవర్ధన్ గౌడ్, బర్ల రమేష్, వేముల వినోద్ గౌడ్, వేముల వెంకటేష్ గౌడ్, కట్కూరి భాను గౌడ్, యువ నాయకుడు వేముల మనిశరణ్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన అతిథులకు వేముల మహేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.