కాసోనీ బాయి తండాలో ఘనంగా తీజ్ పండుగ
ఆర్ జె న్యూస్ మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కాసోనీ బాయి తండాలో 2వ వార్డు కౌన్సిలర్ శారద రాజు నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే తీజ్ పండుగ సందర్భంగా గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబాల సుఖశాంతి, గ్రామాభివృద్ధి కోసం పూజలు చేశారు. సంప్రదాయ నృత్యాల తో సందడి చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శారదా రాజు నాయక్ మాట్లాడుతూ, తీజ్ గిరిజన...