RJNEWS TELUGU
Date of Publish : 26 August 2026, 5:18 pm Posted by : RJ NEWS TELUGU

ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా గృహ ప్రవేశం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ (జంగయ్య) యాదవ్‌ అన్నారు. మేడ్చల్‌ పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో పానుగంటి సువర్ణ, దివంగత వెంకట్రావు కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం, స్థిరత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, మేడ్చల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, 297 డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దుర్గం శివశంకర్‌ ముదిరాజ్‌, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాయిపేట శ్రీనివాస్‌ కురుమ, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.