ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా గృహ ప్రవేశం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్ అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పానుగంటి సువర్ణ, దివంగత వెంకట్రావు కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన...