పీవీ హైస్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పీవీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన, క్రమశిక్షణను అలవర్చడమే కార్యక్రమం ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా నూతన విద్యార్థి నాయకులను పరిచయం చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. హెడ్ బాయ్‌గా శ్రీహర్ష, హెడ్ గర్ల్‌గా హాసిని బాధ్యతలు స్వీకరించారు. పాఠశాల నియమ నిబంధనలను పాటిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని వారిని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె. రామేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్...