మేడ్చల్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

రెండు ఫర్నిచర్‌ దుకాణాలు దగ్ధం.. రూ.20 లక్షల వరకు నష్టం ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పారిశ్రామికవాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-44 పక్కన తాత్కాలిక షెడ్లలో నిర్వహిస్తున్న రెండు ఫర్నిచర్‌ దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారుల వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఫర్నిచర్‌ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి....